Godavari Maha Pushkaram (lit. 'Great Worship of the Godavari River') was a Hindu festival held from 14 July to 25 July 2015. This festival occurs once every 144 years, corresponding to the 12th recurrence of the 12-year Godavari Pushkaram cycle.
2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేసి జరిపించాయి. ఈ పుష్కరాలు గోదావరి నది తీరాన వివిధ ప్రాంతాలలో జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాల నిర్వాహణకు 2014-15 బడ్జెటులో 100 కోట్ల రూపాయలు కేటాయించింది. గోదావరినది మహారాష్ట్ర నాసిక్లో పుట్టి సుమారు 1665 మైళ్ళకు పైబడి ప్రవహించి చివరకు తూర్పున బంగాళాఖాతంలో సాగర సంగమమవుతుంది. ఈ నది గో కళేబరమును ఆవరించి ప్రవహించినది కావున "గోదావరి" అని పేరు వచ్చింది. బృహస్పతి ప్రతిరాశిలోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్ని ఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు. బృహస్పతి ప్రవేశించిన రాశి కర్కాటక రాశి.
no matches found